![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -35 లో......శకుంతల గంగకి టిఫిన్ తీసుకొని వస్తుంది. శకుంతల తనతో ప్రేమగా మాట్లాడుతుంటే మా అమ్మ కూడా ఇలాగే మాట్లాడేది అని లక్ష్మి మాటలని గంగ గుర్తు చేసుకుంటుంది. గంగకి శకుంతల టిఫిన్ తినిపిస్తుంది. అదంతా పెద్దసారు చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు లక్ష్మి ఒక దగ్గర కళ్ళుతిరిగి కిందపడిపోతుంది.
ఒక ఆయుర్వేద వైద్యడు చూసి లక్ష్మీ స్పృహలోకి వచ్చాక తనతో మాట్లాడతాడు. నాకు ఎవరు లేరు.. ఈ పని అయిన చేస్తూ జీవనం సాగిస్తానని లక్ష్మి చెప్పగానే అయితే గుడిలో పని చేయుటకి ఇంకా వంట చేయుటకు కావాలని పూజారి చెప్పారు.. ఆ పనులు చేస్తావా అని అతను అనగానే చేస్తానని లక్ష్మీ అంటుంది. మరొకవైపు రుద్ర దగ్గరికి గంగ వచ్చి థాంక్స్ చెప్తుంది. నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతానని చెప్తుంది. ఉండాలని రుద్ర చెప్తాడు. ఆ మాటలు అన్నీ ఇషిక, వీరు వింటారు. ఎలాగైనా గంగని ఇంట్లో నుండి పంపించాలని ఆ ఇద్దరు అనుకుంటారు. గంగ దగ్గరికి వెళ్లి.. నువ్వుంటే ఈ ఫ్యామిలీ ముక్కలవుతుందని ఇద్దరు కలిసి బెదిరిస్తారు. ఇండైరెక్ట్ గా గంగని ఇంట్లో నుండి వెళ్ళమని చెప్తారు.
ఆ తర్వాత పైడిరాజు ఇంటి దగ్గరికి కి వెళ్తాడు. అప్పుడే గంగ ఫ్రెండ్ వచ్చి పెద్దమ్మ ఎక్కడికో వెళ్లిపోయింది. గంగని ఆ పెద్దింటి వాళ్ళు తీసుకొని వెళ్ళారని చెప్తాడు. ఇప్పుడు నన్ను ఎవరు పోషిస్తారని పైడిరాజు అనుకుంటాడు. ఆ తర్వాత నిద్ర నుండి గంగ సడెన్ గా లేచి నా వల్ల కుటుంబం విడిపోకూడదు.. నేనే వెళ్ళిపోతానంటూ ఇంట్లో నుండి బయల్దేర్తుంది. తరువాయి భాగంలో అందరు లేచేసరికి గంగ ఇంట్లో కన్పించదు. అప్పుడే పైడిరాజు.. పెద్దసారు ఇంటి ముందుకి వచ్చి నా కూతురుని నాతో పంపించండి అని గొడవ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |